పరిషత్‌ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్‌

Politics

పరిషత్‌ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్‌

 

 

అమరావతి: కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరముందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందన్నారు. పుర ఎన్నికల తర్వాత పరిషత్‌ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేదని చెప్పారు. ఎన్నికల నిర్వహణలో జాప్యంపై గవర్నర్‌, హైకోర్టుకు నివేదించాలని సీఎం సూచించారు.

 

వ్యాక్సినేషన్‌కు గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలని.. దీనిపై సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కొవిడ్‌ పరీక్షల సంఖ్య పెంచాలని చెప్పారు. నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా చూడాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *