*ఏపీలో 25 ప్రైవేటు పాఠశాలలు మూత*
ఆంధ్రపద్రేశ్లో 25 ప్రైవేటు పాఠశాలలను మూసివేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. అర్హత కలిగిన ఉపాధ్యాయులు లేకపోవడం, అధిక ఫీజుల వసూళ్లు, మౌలిక సదుపాయాలు లేవని… వీటిని సరిచేసుకునే వరకూ అనుమతులు నిలిపి వేస్తున్నట్లు పేర్కొంది. ఇటీవల పాఠశాల విద్య, నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ప్రైవేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సమయంలో లోపాలు వెలుగు చూడటంతో అనుమతులు నిలిపేయాలని పాఠశాల విద్యాశాఖకు సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అనుమతులు రద్దు చేసిన పాఠశాలల్లో పిల్లలు ఎవరూ ప్రవేశాలు పొందకుండా అవగాహన కల్పించాలని జిల్లా విద్యాధికారులకు సూచించింది.*