studio9focus

ప్రియుడి మోజులో భార్య ఘాతుకం

Crime

హైదరాబాద్ : వివాహేతర సంబంధానికి అడ్డు పడుతున్నాడనే కారణంతో ప్రియుడితో కలిసి సుపారీ గ్యాంగ్‌తో భర్తను చంపించింది. డీసీఎం వ్యానుతో ఢీ కొట్టించి హత్య చేయించింది. దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించింది. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా ప్రియుడితో సహా పోలీసులకు దొరికిపోయి కటకటాలపాలైంది. ఈ ఘటన ఈ ఏడాది మేలో జరిగింది. సుపారీ గ్యాంగ్‌లో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులను సైబరాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బాలానగర్‌ డీసీపీ పద్మజ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. దుండిగల్‌ తండా-2కు చెందిన దరావత్‌ సురేష్‌, బబిత భారాభర్తలు. స్థానికంగా ఉండే ప్రేమ్‌సింగ్‌తో బబితకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం సురేష్‌కు తెలియడంతో భార్యను మందలించాడు. ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. ప్రియుడు ప్రేమ్‌సింగ్‌తో చర్చించి తన భర్త అడ్డుతొలగించాలని కోరింది. ప్రేమ్‌సింగ్‌ తనకు పరిచయస్తులైన సూరజ్‌, అజ్మీరాప్రేమ్‌, ఉత్తరప్రదేశ్‌ రాజులకు రూ.లక్ష సుపారీ ఇచ్చాడు. ఈ ఏడాది మే-16న మేడ్చల్‌ చెక్‌పోస్టు దాటిన తర్వాత బైక్‌పై వస్తున్న సురేష్‌ను యాక్సిడెంట్‌ చేసి హత్య చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *