హైదరాబాద్ : దుబ్బాకలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించబోతుందని టీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి పేర్కొన్నారు. గత రెండు మూడు వారాల నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో పాటు సోషల్ మీడియా ద్వారా పార్టీ గెలుపునకు క్రియాశీలకంగా పని చేశామని ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సమయంల్లో ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధికే పట్టం కడుతామని చెప్పారని క్షేత్రస్థాయిలో ప్రచార బృందానికి నాయకత్వం వహిస్తున్న సిక్కా చంద్రశేఖర్ గౌడ్, రత్నాకర్ కడుదుల, రాజ్ కుమార్ శానబోయిన పేర్కొన్నారు.
