కాస్త దయ చూపండి సారూ..

News

——————————————-
జీవీఎంసీ 56 వార్డు ఏడుమెట్ల- ఆగనంపూడి జాతీయ రహదారిపై గల వంతెన పై గత కొన్ని నెలలుగా ఒక గుర్తు తెలియని ఒక అభాగ్యుడు జీవచ్చంల పడి ఉన్నాడు..రెండు మూడు నెలలుగా భారీ వర్షాలు కురుస్తున్న,ఎండలు కాస్తున్న ఎటువంటి చలనం లేకుండా అక్కడే దుర్భాలమైన జీవితం గడుపుతున్నాడు..మొన్న ఆదివారం కూడా భోజనం పార్సిల్, వాటర్ ప్యాకెట్లు ఇచ్చిన ఎలాంటి ప్రతిస్పందన లేదు..వంతనపై రాకపోకలు సాగిస్తున్న కొంత మంది వాహనదారులు, ప్రయాణికులు ఎవరుకు తోచింది వాళ్ళు సహాయం చేస్తున్నారు.. ఈ మధ్య ఎవరో ఒక ప్రయాణికుడు అతని దినావస్థను చూసి చలించి ఒక పెద్ద ఫ్రీజ్ అట్ట పెట్టెను కప్పి వెళ్లిపోయారు.. అప్పుడప్పుడు ఇలాంటి సహాయం చేస్తున్న వాళ్ళ వల్ల ఇంకా మానవత్వం కాస్తో కూస్తో ఉందన్న నమ్మకం కలుగుతుంది..కొందరు ప్రయాణికులు అయితే చలించి కంటతడి పెట్టడం కొసమెరుపు.. కావున జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ శ్రీధర్ గారు,దువ్వడా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి లక్ష్మీ గారు మానవతా దృక్పథంతో స్పందించి ఈ అపస్మారక స్థితిలో ఉన్న సదరు వ్యక్తిని సంరక్షణ కేంద్రానికి లేదా ఆస్పత్రికి తరలించవలసిందిగా నిత్యం రాకపోకలు సాగిస్తున్న వాహనదారులు, ప్రయాణికులు కోరుచున్నారు.. కావున తమరు స్పందించి మానవత్వంతో కాపాడి ఇంకా ఈ సమాజంలో మానవవత్వం బ్రతికే ఉంది చాటి చెప్పాలని చుట్టుపక్కల గ్రామస్తులు కోరుచున్నారు..

ఇట్లు:

కసిపల్లి శ్రీనివాసరావు
56 వార్డు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *