అమరావతి: మహిళా సాధికారత కోసం వైఎస్సార్ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందుకోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు చేయూత పథకం ద్వారా సహాయం అందించామని, సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. తాజాగా గురువారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో క్యాంపు కార్యాలయంలో రిలయన్స్ రిటైల్, జియో, అల్లాన కంపెనీల ప్రతినిధులు, సెర్ప్ సీఈఓ అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేశారు
