రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ నందినీ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను నటుడు నాగచైతన్య స్వీకరించారు. నాగచైతన్య తన నివాసంలో మొక్కలు నాటి సెల్పీ దిగారు. ఇలాంటి గొప్ప కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు ఎంపీ సంతోష్ కుమార్ కు నాగచైతన్య ధన్యవాదాలు తెలిపారు.
నాగచైతన్య మొక్కలు నాటిన అనంతరం డైరెక్టర్లు విక్రమ్ కే కుమార్, శివ నిర్వాన, సుశాంత్, రకుల్ ప్రీత్ సింగ్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు నామినేట్ చేశారు.