అమరావతి: ఎమ్మెల్సీగా వైసీపీ నాయకుడు పెన్మత్స వెంకట సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు నామినేషన్ గడువు నేటితో పూర్తయింది. అయితే ఈ ఎమ్మెల్సీ పదవికి వైసీపీ తరఫున సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకట రమణ.. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది.
