72 గంటల్లోగా పరీక్షలు పూర్తి చేయండి : ప్రధాని మోదీ

Politics

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పది రాష్ట్రాల సీఎంలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ”రికవరీ రేటు ప్రతిరోజూ పెరుగుతోంది. సగటు మరణాల రేటు తగ్గిపోతోంది. అంటే… మనం తీసుకుంటున్న చర్యలు సరైన దిశలోనే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రతి రాష్ట్రమూ పోరాడుతూనే ఉందని, వ్యాధి నియంత్రణలో ప్రతి రాష్ట్రం పాత్రా ప్రముఖమైందని ఆయన స్పష్టం చేశారు.

వ్యాధి లక్షణాలున్నట్లు 72 గంటల్లో గనుక నిర్ధారణ అయితే… మహమ్మారని నియంత్రించడం చాలా సులువని నిపుణులు పేర్కొంటున్నారని, అందుకే వ్యాధితో సంబంధమున్న వారితో సంపర్కంలోకి వచ్చిన వ్యక్తులకు 72 గంటల్లోగా పరీక్షలు పూర్తి చేయడం చాలా ముఖ్యమని ఆయా రాష్ట్రాల సీఎంలకు మోదీ సూచించారు. ప్రతి రోజూ 7 లక్షల టెస్టులు చేస్తున్నారని, ఈ సంఖ్య పెరుగుతూనే ఉందని పేర్కొన్నారు.వ్యాధి సంక్రమణను గుర్తించి, నివారించడానికి ఇది ఎంతో సహాయకారిగా ఉంటుందని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *