హైదరాబాద్ : అక్రమ సంబంధం నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైంది. ఈ ఘటన నగరంలోని చిలుకానగర్ పరిధి కుమ్మరికుంటలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలిని నాచారం బాబానగర్‌కు చెందిన రేణుక(30)గా గుర్తించారు. చిలుకానగర్‌కు చెందిన డ్రైవర్‌గా పనిచేసే అంజయ్య అనే వ్యక్తితో గత నాలుగేళ్లుగా వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంజయ్య భార్య పుంటింటికి వెళ్లింది. ఈ సమయంలో రేణుక, అంజయ్య తరుచుగా కలుసుకుంటుండేవారు. సోమవారం సైతం రేణుక.. అంజయ్యను కలిసేందుకు వెళ్లింది. ఏదో చిన్న విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం పెరిగి కోపోద్రిక్తుడైన అంజయ్య ఖాళీ బీరు సీసా బాటిల్‌తో రేణుక తలపై మోదాడు. అనంతరం కిందపడ్డ రేణుకను ఊపిరాడకుండా చేసి చంపేశాడు. సమాచారం అందుకున్న ఉప్పల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంజయ్యను అరెస్టు చేసి జూడిషియల్ కస్టడీకి తరలించారు.
