studio9focus

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి

News

వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి పెన్మత్స సాంబశివరాజు (88) అనారోగ్యంతో కన్నుమూసారు. గంత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమ్మడి రాష్ట్రంలో ఏకైక నాయకుడుగా, రాజకీయ కురువృద్దుడిగా గుర్తింపు పోందారు సాంభ శివరాజు. 1989-94 లో మంత్రిగా పనిచేసారు. 1958లో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నిక అయిన ఆయన .. 1968లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.. గజపతినగరం, సతివాడ శాసనసభ స్థానాల నుంచి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా పనిచేసారు. మంత్రి బొత్సకు రాజకీయ గురువుగా .. గుర్తింపు పొందారు సాంభ శివరాజు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *