టీ 20 ప్రపంచ కప్ ల వేదికల పై క్లారిటీ ఇచ్చిన ఐసీసీ…

Sports

ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ప్రపంచ కప్ కరోనా కారణంగా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దాంతో 2021,2022 వరల్డ్ కప్ లు వరుసగా జరగనున్నాయి. వచ్చే ఏడాదికి వాయిదా పడిన టోర్నీ భారత్ వేదికగా బీసీసీఐ నిర్వహిస్తున్నది అని వార్తలు వచ్చాయి. కానీ కరోనా కారణంగా నష్టపోయిన క్రికెట్ ఆస్ట్రేలియా 2021 లో జరగాల్సిన టోర్నీ హక్కులు మాకు ఇచ్చి 2022 లో జరిగే ప్రపంచ కప్ ను భారత్ వేదిక నిర్వహించాలని ఐసీసీ ని కోరింది. కానీ 2023 లో జరగాల్సిన ఐసీసీ వన్డే వరల్డ్ కప్ భారత్ వేదికగా జరగాల్సి ఉంది. దాంతో వరుసగా రెండు ప్రపంచ కప్ టోర్నీలను నిర్వహించడం కష్టం అవుతుంది అని బీసీసీఐ ఐసీసీకి వివరించింది. ఇక నిన్న జరిగిన ఐసీసీ సమావేశంలో ఈ విషయం పై చర్చించారు. బీసీసీఐ వివరణతో ఏకీభవించిన ఐసీసీ కూడా కరోనా కారణంగా వాయిదాపడిన 2021 ప్రపంచ కప్ ను భారత్ వేదికగా ఆ తర్వాత ఏడాది జరగాల్సిన టోర్నీని ఆసీస్ వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఇలా చేస్తే రెండు ప్రపంచ కప్ ల మధ్య బీసీసీఐ కి ఏడాది సమయం దొరుకుతుంది కాబట్టి ఎటువంటి సమస్య ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *