సౌతాంప్టన్: ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ మహేంద్రసింగ్ ధోనీ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును తాజాగా మోర్గాన్ బ్రేక్ చేశాడు. కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఇంగ్లీష్ సారథి అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఓవరాల్‌గా అత్యధిక సిక్సర్లు (212*) బాదిన కెప్టెన్‌గా ధోనీ(211)ని మోర్గాన్ అధిగమించాడు.
మోర్గాన్ కేవలం 163 మ్యాచ్‌ల్లో 211 సిక్సర్లు బాదగా ధోనీ 332 మ్యాచ్‌ల్లో 211 మార్క్ అందుకున్నాడు. ఐర్లాండ్‌తో మూడో వన్డేలో ఇయాన్ మోర్గాన్ (84 బంతుల్లో 106; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సూపర్ సెంచరీతో చెలరేగి అరుదైన ఫీట్ చేరుకున్నాడు. ఆసీస్ క్రికెటర్ రికీ పాంటింగ్(171 సిక్సర్లు), బ్రెండన్ మెక్‌కలమ్(170 సిక్సర్లు) అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో ఉన్నారు.