భారత్‌లో కొత్తగా 52,050 కరోనా పాజిటివ్ కేసులు

News

Coronavirus Updates in India: భారత్‌లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 18 లక్షల 50 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 52,050 కేసులు నమోదు కాగా, 803 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 44,306 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 18,55,745 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 5,86,298 ఉండగా, 12,30,509 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 38,938 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 66.31 శాతంగా ఉంది. కాగా, నిన్నటి వరకు మొత్తం 2,08,64,750 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,61,892 శాంపిళ్లను పరీక్షించినట్లు వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *