ఏలూరులో కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ

News

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు సీఆర్‌ఆర్ కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు దొంగలు పరారయ్యారు. జిల్లా జైల్లో ఉన్న వీరికి కరోనా సోకడంతో సీఆర్‌ఆర్ పాలిటెక్నిక్ కోవిడ్ సెంటర్‌కు తరలించారు. ఇదే అదనుగా భావించిన ఇద్దరు దుండగులు శనివారం తెల్లవారుజామున సుమారు మూడు గంటల ప్రాంతంలో కోవిడ్ సెంటర్ నుంచి పరారయ్యారు. దీంతో ఏలూరు త్రీ టౌన్ పోలీసులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు పరారైన దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *