కరోనాతో సీనియర్ నటుడు కన్నుమూత..

News

కరోనా వైరస్ చాలా మంది ప్రముఖులను ఇప్పటికే పొట్టన పెట్టుకుంది. తెలుగులో కూడా పోకూరి రామారావు లాంటి నిర్మాతలు చనిపోయారు. బాలీవుడ్‌లో అయితే చాలా మంది సెలబ్రిటీస్ కరోనాతో పోరాడి మరణించారు. ఇప్పుడు మరో ప్రముఖ నటుడు కూడా కరోనా వైరస్‌తోనే కన్నుమూసాడు. ఈ వైరస్‌తో చివరి వరకు పోరాడి ఓడిపోయాడు కన్నడ సీనియర్‌ నటుడు హులివానా గంగాధరయ్య. ఈయన వయసు 70 సంవత్సరాలు. కొన్ని రోజుల కింద కరోనా బారిన పడిన ఆయన శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. వెంటనే ఆయన్ని బెంగళూరులోని బీజీఎస్‌ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గంగాధరయ్య పరిస్థితి విషమించడంతో జులై 18 రాత్రి ఆయన ప్రాణాలు విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. థియేటర్ ఆర్టిస్టు నుంచి మొదలు పెట్టి గొప్ప నటుడిగా పేరు సంపాదించుకున్న గంగాధరయ్య “కర్ణాటక నాటక అకాడమీ” అవార్డు సైతం అందుకున్నారు. కన్నడలో దాదాపు 120 సినిమాల్లో నటించారు.. ఇక షోల విషయానికి వస్తే 1500 కు పైగానే ఉన్నాయి. నీర్ దోసె, కురిగాలు సర్ కురిగాలు, శబ్దదేవి సినిమాలు ఆయనకు మంచి పేరును తీసుకొచ్చాయి. గంగాధరయ్య మృతితో కన్నడనాట విషాద ఛాయలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదే స్టార్ హీరో చిరంజీవి సర్జతో పాటు స్టార్ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ కూడా కన్నుమూసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *