నటి ఈషారెబ్బా రీసెంట్ గా గ్లామరస్ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలకు ప్రత్యేకంగా క్యాప్షన్ ఏదీ ఇవ్వలేదు కానీ రెండు సీతాకోక చిలుకల ఎమోజీలను మాత్రం పెట్టింది. మెరుస్తున్న బ్లూ కలర్ గౌన్ లో అందంగా ఫోజులిచ్చింది. గౌన్ చాలా పొట్టిగా ఉండడంతో ఎంతో స్టైలిష్ గా ఉంది. మెడలో నెక్లెస్.. చేతి వెలికి ఒక ఉంగరం తప్ప పెద్దగా ఆభరణాలేవీ ధరించలేదు. హై హీల్స్ వేసుకుని .. పైకి చూస్తూ ఒక మోడల్ తరహాలో ఫోజిచ్చింది. ఇలాంటి ఫోటోలతోనే తెలుగు అమ్మాయిలు బాలీవుడ్ బ్యూటీలకు ఏమాత్రం తీసిపోరని ఫిలిం మేకర్లకు తనవైపునుండి హింట్స్ ఇస్తోంది. ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి మంచి స్పందన దక్కింది. “నువ్వు అందాలరాశి”.. “బ్యూటీ అలర్ట్”.. “బేబీ డాల్ డ్రెస్ లో ఏంజెల్”..”హాట్ థైస్” అంటూ రెచ్చిపోయారు.
