మూడు ప్రాజెక్టులతో బిజీగా ‘త్రిష’

Entertainment

ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ త్రిష. ఇప్పుడు తమిళ సినిమాలకే పరిమితమైంది. కొరటాల శివ- చిరంజీవి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రంతో మళ్లీ టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రబృందం త్రిషని సంప్రదించిందని, ఆమె చిరు 152వ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని టాక్. అయితే చిరు సినిమాతో పాటు మోహన్ లాల్ నటిస్తున్న రామ్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది త్రిష. ఈ సినిమా వివిధ దేశాలలో విడుదల కానుందట. మరోవైపు మణిరత్నం తెరకెక్కిస్తున్న ప్రతిష్మాక చిత్రం పొన్నైన్ సెల్వన్‌లోను త్రిష హీరోయిన్ గా ఎంపికైందని సమాచారం. ఈ మూడు ప్రాజెక్ట్‌లు 2020లో విడుదల కానుండగా, వచ్చే ఏడాది త్రిష సందడి ఓ రేంజ్‌లో ఉండటం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *