మహేష్ బాబు వెంటపడిన రష్మిక..!

Entertainment

హి ఈజ్ సో క్యూట్ సాంగ్ లిరిక్స్, మ్యూజిక్ అంతగా బాగోకపోయినా.. ఆ సాంగ్ లో మహేష్ వెంటపడుతూ రష్మిక మందన్న చేసిన అల్లరి, డాన్స్ మాములుగా లేదు. నిజంగా మహేష్ బాబు క్యూట్ గానే ఉన్నాడు. కానీ రష్మిక మాత్రం మరింత క్యూట్ గా ఈ సాంగ్ కి స్టెప్పులతో ఇరగదీసింది. టీజర్ లో స్పేస్ లేదు, పోస్టర్స్ లో స్పేస్ లేదు అంటూ రష్మికతో పాటుగా ఆమె అభిమానులు కూడా తెగ ఫీల్ అయ్యారు. సరిలేరు నీకెవ్వరూ నుండి వదిలిన మూడో సాంగ్ మొత్తం రష్మిక మీదనే షూట్ చేశారు. మహేష్ బాబుబ్యాగ్ తో అలా నడుస్తున్నప్పటికీ.. అందరి కళ్ళు రష్మిక డాన్స్ మీదే వున్నాయి. సంగీత, హరితేజ లతో కలిసి రష్మిక వేసిన డాన్స్ స్టెస్ప్ భీబత్సంగా ఉన్నాయంటున్నారు అభిమానులు. మహేష్ ఎలాంటి స్టెప్స్ వేయకపోయినా.. రష్మిక లుక్స్, ఆమె డ్రెస్, ఒక టైం లో రష్మిక వేసిన పల్లెటూరి గెటప్ ఇలా అన్ని రష్మికని హైలెట్ చేసేలా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *