మాకు తెలియదు: అమెరికా కొత్త లాసూట్‌పై ఇన్ఫోసిస్ స్పందన

Business

బెంగళూరు: తమ కంపెనీపై వేసిన కొత్త దావా గురించి తమకు తెలియదని ఇన్ఫోసిస్ శుక్రవారం వివరణ ఇచ్చింది. ఇప్పటికే కంపెనీ నిర్వాహక బృందంలోని కీలక వ్యక్తులపై పలు ఆరోపణలు వచ్చాయి. దీంతో మళ్లీ కొత్తగా వీరిపై అమెరికాలో కేసు దాఖలు కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ స్పందించింది.

మరో షాక్.. ఇన్ఫోసిస్‌లో నష్టపోయారా, ఇక్కడ కలవండి

మీడియాలో వచ్చిన వార్తలు తమ దృష్టికి వచ్చాయని, వీటిలో అదనంగా మరో దావా దాఖలు కానున్నట్లు వెల్లడించాయి. 24 అక్టోబర్ 2019లో వచ్చిన ఫిర్యాదులు కాకుండా ఇప్పుడు అదనపు ఫిర్యాదులపై కంపెనీకి ఎలాంటి సమాచారం ఇవ్వడం సహజమేనని పేర్కొంది. దావాలో మరికొందరిని భాగస్వాములను చేసుకునేందుకు ఇలా చేస్తారని, ఇందులో భాగంగా లా ఫర్మ్ ప్రకటన చేసినట్లుగా భావిస్తున్నట్లు తెలిపింది.

కాగా, సాఫ్టువేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు మరో షాక్ తగిలిన విషయం తెలిసిందే. అమెరికాలో మరో దావాను ఎదుర్కోనున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై యూఎస్‌లో క్లాస్ యాక్షన్ లాసూట్ (దావా) దాఖలు కానుందని, లాస్‌ఏంజిల్స్‌కు చెందిన వాటాదారుల హక్కుల పరిరక్షణ సంస్థ ది స్కాల్ లా ఫర్మ్ ఈ లాసూట్ దాఖలు చేస్తోందని వార్తలు వచ్చాయి. స్వల్పకాలానికి ఆదాయ, లాభాలను పెంచి చూపేందుకు కంపెనీ తన ఆర్థిక నివేదికల్లో తప్పుడు లెక్కలు ప్రకటించిందని చెబుతోంది.

కొద్ది రోజుల క్రితం ఇన్ఫోసిస్ పైన విజిల్ బ్లోయర్స్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆంశంపై ఇప్పటికే అమెరికా మార్కెట్ నియంత్రణాధికార సంస్థఎస్ఈసీ దర్యాఫ్తు చేస్తోంది. ఈ విచారణ కొనసాగుతుండగానే వీరి ఆరోపణల ఆధారంగానే ఈ సంస్థ తాజాగా కంపెనీపై దావాకు సిద్ధమైంది. ఇన్ఫోసిస్ పాటించిన అనైతిక ధోరణలు కారణంగా ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు పేర్కొంది. వాటిని రికవరీ చేయడం కోసం అమెరికాకు చెందిన ఈ సంస్థ లాసూట్ దాఖలు చేస్తున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *