నిన్న మొన్నటి వరకు ప్రతివారి నోటిలో జియో అనే మంత్రమే వినిపించింది. ఎక్కడ చూడు జియో నెట్వర్క్ ఫోన్లే.. కూలీల దగ్గరి నుండి బిజినెస్ మ్యాన్ల వరకు, కాలేజీ పిల్లల దగ్గరి నుండి ముసలోల్ల వరకు పొద్దున లేచింది మొదలు పడుకునే వరకు జియో అంటూనే కలవరించే వారు. అంతలా ప్రతి వారిని జియో మత్తులోకి దించింది. ఇక ఈ మత్తు వదిలే సమయం ఆసన్నమవుతుంది..
ఇదివరకు టెలికం రంగంలోకి అన్నీ ఉచితమంటూ ప్రవేశించిన రిలయన్స్ జియో.. ఆ తర్వాత ఓ సునామీలా ఆగకుండా తమ వినియోగదారులను పెంచుకుంటూ పోయింది.. ఇక, కొత్త కొత్త ప్లాన్లతో ఎప్పటికప్పుడు వినియోగదారులను ఆకట్టుకుంటున్నా.. గత నెల నుంచి నాన్ జియో కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తోంది. ఈ దశలో బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ఇవాళ సంచలన ప్రకటన చేసింది. అదేమంటే..
రాబోయే కొద్ది వారాల్లో మొబైల్ ఫోన్ కాల్ మరియు డేటా ఛార్జీలను పెంచుతామనే విషయాన్ని, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వచ్చే నెల నుండి కాల్, డేటా ఛార్జీల పెంపును ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ ప్రకటన చేసింది జియో. టెలికాం సుంకాల సవరణ కోసం టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని జియో పేర్కొంది.