కర్నూలులో దారుణం జరిగింది. భార్యను కాపురానికి తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లిన ఓ యువకుడిపై భార్య తరుపు కుటుంబ సభ్యులు తీవ్రంగా దాడి చేశారు. అంతేకాదు,అతని మర్మాంగాన్ని కోసేశారు. స్థానికులు అతన్ని గమనించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కర్నూలు జిల్లాలోని గుడివేముల మండలం సోమాపురంలో ఈ దారుణం జరిగింది. బాధితుడి భార్య గత మూడేళ్లుగా పుట్టింటిలోనే ఉంటోందని.. ఆమెను కాపురానికి తీసుకెళ్లేందుకు బుధవారం అతను వచ్చాడని స్థానికులు తెలిపారు.అయితే భార్య కుటుంబ సభ్యులు అతని పట్ల దారుణంగా ప్రవర్తించారని.. తాళ్లతో కట్టేసి చితకబాదారని చెప్పారు. అనంతరం కిరాతకంగా అతని మర్మాంగాన్ని కోసేసినట్టు తెలిపారు.
