అవన్నీ టపుడు కేసులేనంటోన్న సౌమ్య

News

గుంటూరు జిల్లా అనంతవరంలో జరిగిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి సంఘటనలో తప్పుడు కేసులు పెట్టారని, దీనిని ఖండిస్తున్నామని, ఈ కేసులు ఉపసంహరించు కోవాల్సిందిగా మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గురువారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ… వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి దర్శనం కూడా చేసుకోలేదని వైసీపీ నాయకులు ఆరోపణ చేశారని, ఇది అవాస్తవమన్నారు.

దర్శనం చేసుకొని ప్రసాదం కూడా స్వీకరించినట్లు ఫొటోలున్నాయన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకున్న తరువాత వైసీపీ లీడర్‌ అశోక్‌ తండ్రిని ఎమ్మెల్యేగారి పీఏ తోసేయడం జరిగిందన్నారు. మిగతా నాయకులందరూ కూడా ఎమ్మెల్యే గో బ్యాక్‌… గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేయడం జరిగిందని చెప్పారు. ఇక్కడి దృశ్యాలు చూస్తే టీడీపీ కార్యకర్తలకుగానీ, నాయకులకుగానీ ఈ ఘటనతోఎలాంటి సంబంధం లేదన్నారు. అనవసరంగా తెలుగుదేశం నాయకులపై ఎస్‌సి, ఎస్‌టి కేసులు పెట్టడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే శ్రీదేవి తాము క్రిష్టియన్లు అని చెప్పడం జరిగింది.

అలాంటప్పుడు ఎస్‌సి, ఎస్‌టి కేసులు ఏ విధంగా పెట్టారని ప్రశ్నించారు. ఎస్‌సి, ఎస్‌టి కేసు 34 మందిపైన ఏ విధంగా పెట్టారన్నారు? ఇవన్నీ పరిశీలించి కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ దళితులకి అత్య్తున్నత స్థానం కల్పిస్తూ వచ్చిందన్నారు. ఒకసారి చరిత్రను అవలోకనం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎందరో దళితులని నాయకులుగా తీర్చిదిద్దడం జరిగింది. దళిత నాయకులకు, దళిత మహిళలకు పెద్దపీట వేస్తూ వచ్చాము.

ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ని చేయడంలోనూ, బలయోగి గారిని లోక్‌సభ స్పీకర్‌ని చేయడం టీడీపీ హయాంలోనే జరిగింది. అమరావతిలో అంబేద్కర్‌ 120 అడుగుల పైగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చంద్రబాబునాయుడుగారు కృషిచేశారు. ఎప్పుడు దళితుల కోసం పనిచేస్తూ వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలు. నిజాలు చెప్పండి. సీఎం ఆఫీసు నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ చదవడంకాదన్నారు. పద్ధతులు మార్చుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *