అతడి భార్యతో రొమాన్స్ .

Entertainment

వివాదాలకు..గాసిప్స్‌కు దూరంగా ఉంటాడు నటుడు సూర్య. `కప్పాన్` ఆడియో ఈవెంట్ లో సూర్య అన్న ఓ మాట అభిమానుల్లో చర్చకొచ్చింది. ఈ వేదికపై తన కొలీగ్ అయిన హీరో ఆర్య గురించి ప్రస్థావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యను చేశారు. “ఈ సినిమాలో నాతో పాటు ఆర్య ఉన్నప్పటికీ .. తన భార్య సాయేషాతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది” అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యకు వేదికపై ఉన్న ఆర్య కూడా సరదాగానే నవ్వేశారట. ఇక ఈ సినిమాలో నటించేప్పుడే ఆర్య- సయేషా ఒకరితో ఒకరు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ప్రేమ ఫలించి పెద్దలు ఈ జంటను ఒకటిగా చేశారు. ఇకపోతే కప్పాన్ చిత్రంలోనూ ఈ జోడీ ప్రేమికులుగా నటించారు. ఆ ఇద్దరి నటనను సూర్య తెగ పొగిడేశారు. పనిలో పనిగా ఆర్య ఉన్నప్పటికీ నేను సయేషాతో జంటగా నటించానని కొంత బాధగా అనిపించినా సినిమా కాబట్టి తప్పలేదని సూర్య అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *