ఓడిన కుమార స్వామి – వీగిన విశ్వాసం

News

కర్నాటక : కర్ణాటకలో కుమారస్వామి సంకీర్ణ సర్కార్ కుప్పకూలింది. సుదీర్ఘ చర్చ అనంతరం కుమారస్వామి కూటమి సర్కర్ బలపరీక్షకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి విజ్ఞప్తిమేరకు స్పీకర్ రమేష్ కుమార్ డివిజన్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. సభకు 205 మంది హాజరుకాగా, మేజిక్ ఫిగర్ 103 అవసరమైంది. సర్కార్‌కు అనుకూలంగా 99 ఓట్లు, వ్యతిరేకంగా 105 ఓట్లు పోలవడంతో కుమారస్వామి సర్కార్ కుప్పకూలింది. స్పీకర్ ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఓటింగ్ ఫలితాల అనంతర సభను స్పీకర్ నిరవధికంగా వాయిదా వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *