పరిషత్‌ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్‌

పరిషత్‌ ఎన్నికలూ పూర్తిచేయాల్సింది: జగన్‌     అమరావతి: కరోనా పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికలను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరముందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తయితేనే వ్యాక్సినేషన్‌ వేగంగా జరుగుతుందని చెప్పారు. ప్రధాని మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం అధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ వ్యాక్సినేషన్‌కు రాష్ట్రంలోని ఎన్నికల ప్రక్రియ అడ్డుతగిలిందన్నారు. పుర ఎన్నికల తర్వాత పరిషత్‌ ఎన్నికలు కూడా పూర్తయితే బాగుండేదని చెప్పారు. ఎన్నికల […]

Continue Reading

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం_

_గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్పలత విజయం_   _గుంటూరు: గుంటూరు-కృష్ణా జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానంలో కల్పలత విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో బొడ్డు నాగేశ్వరరావుపై కల్పలత గెలుపొందారు. విజయానికి కావాల్సిన 50 శాతం ఓట్లు దాటడడంతో ఆమె విజయం సాధించారు. 6,153 ఓట్లు దాటగానే కల్పలత గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంగా కల్పలత మీడియాతో మాట్లాడారు. ‘‘నా విజయం కోసం కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉపాధ్యాయుల సమస్యల […]

Continue Reading
studio9focus

నిరూపిస్తే నిమిషంలో రాజీనామా చేస్తా: కేసీఆర్‌

జనగామ: దుబ్బాక ఉప ఎన్నికల్లో భాజపా అసత్య ప్రచారం చేస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. దేశాన్ని పాలిస్తున్న భాజపా.. పింఛన్ల విషయంలో అవాస్తవాలు మాట్లాడుతోందన్నారు. నిజాయతీ లేని ప్రభుత్వాన్ని బదనాం చేస్తారేమో గానీ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరన్నారు. దుబ్బాకలో బ్రహ్మాండంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 38,64,751 మందికి ఒక్కొక్కరికి రూ.2016 చొప్పున పింఛన్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం తరఫున 6,95,000 మందికి రూ.200ల చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ల […]

Continue Reading
studio9focus

దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయం : టీఆర్‌ఎస్‌ యూకే శాఖ

హైదరాబాద్‌ : దుబ్బాకలో జరుగనున్న ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి భారీ విజయం సాధించబోతుందని టీఆర్‌ఎస్‌ ఎన్నారై యూకే శాఖ అధ్యక్షుడు అశోక్‌ గౌడ్‌ దూసరి పేర్కొన్నారు. గత రెండు మూడు వారాల నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం చేయడంతో పాటు సోషల్‌ మీడియా ద్వారా పార్టీ గెలుపునకు క్రియాశీలకంగా పని చేశామని ఉపాధ్యక్షుడు నవీన్‌రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ప్రచారం నిర్వహించిన సమయంల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌ పార్టీకి, సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధికే పట్టం కడుతామని చెప్పారని […]

Continue Reading

గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని పరామర్శించిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి

గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారిని పరామర్శించిన గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి : ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ & పురపాలక శాఖమంత్రి వర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి మాతృమూర్తి ఇటీవలి కాలం చేసిన సందర్భంగా రోజు విజయనగరం మంత్రిగారి స్వగృహంలో కీర్తిశేషులు శ్రీమతి ఈశ్వరమ్మ గారికి చిత్రపటానికి నివాళులర్పించి బొత్స సత్యనారాయణ గారిని పరామర్శించడం జరిగింది

Continue Reading

మహిళా సాధికారత కోసం వైఎస్సార్‌ చేయూత

అమరావతి: మహిళా సాధికారత కోసం వైఎస్సార్‌ చేయూత కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. ఇందుకోసం ఏటా దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. సమాజంలో అణగారిన వర్గాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45 – 60 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు చేయూత పథకం ద్వారా సహాయం అందించామని, సంతృప్త స్థాయిలో పథకాన్ని అమలు చేశామని పేర్కొన్నారు. మహిళలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలతో […]

Continue Reading

కులాన్ని భ్రష్టు పట్టిస్తున్న చంద్రబాబు

అగ్ని ప్రమాదంలో పది మంది చనిపోతే కేసు పెట్టరా? గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఫైర్‌  హనుమాన్‌ జంక్షన్‌ రూరల్‌ : ‘ఏ సమస్య వచ్చినా దానికి కులం రంగు పూయడం చంద్రబాబునాయుడుకు అలవాటైంది. కమ్మ వాళ్లను భ్రష్టు పట్టిస్తున్నాడు’ అని కృష్ణా జిల్లా గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీమోహన్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం బాపులపాడు మండలం ఆరుగొలనులో మీడియాతో మాట్లాడారు

Continue Reading

ఎమ్మెల్సీగా ఎన్నికైన పెన్మత్స సూర్యానారాయణ రాజు

అమరావతి: ఎమ్మెల్సీగా వైసీపీ నాయకుడు పెన్మత్స వెంకట సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికకు నామినేషన్ గడువు నేటితో పూర్తయింది. అయితే ఈ ఎమ్మెల్సీ పదవికి వైసీపీ తరఫున సూర్యనారాయణ రాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఇతరులెవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. దీంతో సూర్యనారాయణ రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన మోపిదేవి వెంకట రమణ.. […]

Continue Reading

కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్ సర్కార్ సీరియస్.. రేపు కీలక భేటీ

తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడాన్ని సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తీరుపై తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం సీరియస్ తీసుకుంది. కేసీఆర్ వ్యాఖ్యలతో పాటు అపెక్స్ కమిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం వినిపించాల్సి వాదనలపై సీఎం జగన్ అధికారులతో చర్చలు జరపనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఇరిగేషన్ శాఖపై సీఎం జగన్ సమీక్ష […]

Continue Reading

72 గంటల్లోగా పరీక్షలు పూర్తి చేయండి : ప్రధాని మోదీ

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పది రాష్ట్రాల సీఎంలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్ పరిస్థితులు, వారు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. ”రికవరీ రేటు ప్రతిరోజూ పెరుగుతోంది. సగటు మరణాల రేటు తగ్గిపోతోంది. అంటే… మనం తీసుకుంటున్న చర్యలు సరైన దిశలోనే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం” అని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రతి రాష్ట్రమూ పోరాడుతూనే ఉందని, వ్యాధి నియంత్రణలో ప్రతి రాష్ట్రం పాత్రా ప్రముఖమైందని ఆయన స్పష్టం […]

Continue Reading